

లోక్ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును చారిత్రాత్మక అవకాశంగా పేర్కొన్నారు. దేశ జనాభాలో సగం అయిన మహిళలకు అధికారం ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించే అవకాశం ఇది అని చెప్పారు. సమయం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని, మహిళల సాధికారత ఎంతో ముఖ్యమని తెలిపారు.
మహిళలకు అధికారం ఇవ్వడం అంటే వికసిత భారత్ నిర్మాణానికి మార్గం వేయడమే అని ఆయన అన్నారు. మహిళలు అవకాశాలు పొందితే దేశాన్ని మంచి దిశలో నడిపించగలరని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా ఈ బిల్లు ఆమోదం పొందలేదని, దీన్ని వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరని హెచ్చరించారు.
ఎన్నికల్లో మహిళలు తమ శక్తిని ఇప్పటికే చూపించారని, వికసిత భారత్ సాధనలో వారి పాత్ర కీలకమని తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే భవిష్యత్తులో రాజకీయ స్థానం ఉంటుందని చెప్పారు. ఈ బిల్లుకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, దేశమంతా దీనిని స్వాగతిస్తోందని పేర్కొంటూ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!