

హర్మూజ్ జలసంధి దిగ్బంధనం భయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం తర్వాత ముడి చమురు ధరలు 70 డాలర్ల నుంచి 115 డాలర్లకు ఎగసిపడగా, తాజాగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దిగ్బంధనం కొనసాగితే బ్యారెల్ ధర 140 నుంచి 150 డాలర్ల వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ సరఫరాలో కీలకమైన హర్మూజ్ మార్గం మూతపడితే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోవడం ద్వారా ఈ సంక్షోభం ప్రపంచ యుద్ధ స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాలు భారత్‌పై కూడా భారీ ప్రభావం చూపే అవకాశముంది. దేశం తన ముడిచమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ధరల పెరుగుదలతో ఇంధన బిల్లు రూ.23 లక్షల కోట్ల వరకు చేరే ప్రమాదం ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం అధికమవడంతో పాటు జీడీపీ వృద్ధిపై ప్రభావం పడొచ్చు. స్టాక్ మార్కెట్లలో కూడా ఈ ఉద్రిక్తత ప్రభావం కనిపించగా, సెన్సెక్స్ ఒక దశలో 1,600 పాయింట్లు పడిపోయింది. రూపాయి విలువపై ఒత్తిడి పెరగడమే కాకుండా, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల ఉపాధి, రెమిటెన్సులపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.








_1775900374811.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!