

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాగృతి ప్రారంభించిన పోరాటం దేశవ్యాప్తంగా మహిళలకు మేలు చేసే దిశగా సాగిందని కవిత పేర్కొన్నారు. ఈ బిల్లుకు ముందడుగు పడటానికి తమ ప్రయత్నాలు కారణమయ్యాయని ఆమె తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన దీక్షకు జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా 18 రాజకీయ పార్టీలను సమన్వయం చేసి, వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యేలా చేశారు.
జాగృతి ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచడం వల్లే ఈ బిల్లు వచ్చినట్లు కవిత అన్నారు. అయితే ఈ బిల్లులో ఉన్న ప్రయోజనం తక్షణం అందేలా లేదని, ఇది ముందస్తు లాభం ఇవ్వని విధంగా ఉందని ఆమె విమర్శించారు. బీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేకుండా బిల్లు ఆమోదించబడిందని, అలాగే డిలిమిటేషన్‌కు అనుసంధానం చేయడం వల్ల అమలు ఆలస్యమైందని చెప్పారు. దీని కారణంగా ఇటీవలి పార్లమెంట్ మరియు రాష్ట్ర ఎన్నికల్లో మహిళలకు ప్రయోజనం కలగలేదని పేర్కొన్నారు.
2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం మళ్లీ అన్యాయానికి దారితీస్తుందని కవిత అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జనగణన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని, బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ బిల్లును ముందుగానే అన్ని పార్టీలకు ఇవ్వకపోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. మహిళల హక్కులను సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!