
న్యూస్

మద్రాస్ హైకోర్టు నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమె చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు సమర్పించలేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై గతంలో వచ్చిన సింగిల్ జడ్జి తీర్పును కూడా కోర్టు సమర్థించింది.
2008లో బ్రాండ్ ప్రమోషన్ కోసం తమన్నా, పవర్ సోప్స్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం 2009 అక్టోబర్ వరకు ఆమె ఫోటోలను వినియోగించుకోవచ్చు. అయితే 2010-2011 మధ్య తన అనుమతి లేకుండా ఫోటోలను ఉపయోగించారని ఆరోపిస్తూ రూ.1 కోటి నష్టపరిహారం కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం కూడా కొట్టివేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!