

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా తన వివరాలను నమోదు చేసుకున్నారు. గృహ గణన కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ ప్రక్రియను జనగణన డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30 వ తేదీ వరకు ప్రజలు తమ ఇళ్ల వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
వచ్చే నెల 1 నుండి 30 వరకు అధికారులు ఇంటింటికి వెళ్లి భౌతిక గణన చేపడతారు. ప్రతి పౌరుడికి సమానంగా సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. కుటుంబాన్ని ప్రాథమిక యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి జనగణన కీలకమని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు సరైన వివరాలు నమోదు చేసి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!