

ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ భారీ రక్షణ ఒప్పందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అదనంగా, భారత నావికాదళం కోసం 6 పీ-8i సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకూ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రఫేల్ డీల్‌తో భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల ద్వితీయార్థంలో భారత్‌కు రానుండగా, ఆయన పర్యటన సందర్భంగా ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. ఒప్పందం ప్రకారం 18 రఫేల్ విమానాలను ఫ్లై-అవే కండిషన్లో నేరుగా అందిస్తారు. మిగిలిన 96 విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. రఫేల్ తయారీ సంస్థ డసో ఏవియేషన్ భారత ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద 36 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!