

బిహార్‌లో త్వరలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మరియు బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి ఈ పదవిని స్వీకరించే అవకాశముంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొని కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేసే అవకాశముంది.
ఈ నెల 14వ తేదీన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తరువాత కొత్త ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఈ నెల 15వ తేదీన సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. బిహార్ చరిత్రలో బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సామ్రాట్ చౌదరి 1990లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో పర్బత్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత వివిధ పార్టీల్లో కొనసాగి చివరకు బీజేపీలో చేరారు.2023 సంవత్సరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2024 సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి చేరువయ్యారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!