
న్యూస్

అంథ్రోపిక్ సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి గ్లాస్‌వింగ్ అనే కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం క్లోడ్ మిథోస్ ప్రివ్యూ అనే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి పెద్ద సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ ఏఐ మోడల్ ఇప్పటికే వేల సంఖ్యలో సాఫ్ట్వేర్ లోపాలను గుర్తించినట్లు సంస్థ తెలిపింది. సైబర్ భద్రతను మెరుగుపరచడానికి భారీ నిధులను కూడా కేటాయించింది. ప్రస్తుతం ఈ మోడల్ కొద్దిమంది భాగస్వామ్య సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!