
న్యూస్

పదేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న మణిరత్నం, 2015 లో ఓకే బంగారం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినా, పొన్నియిన్ సెల్వన్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇటీవల చేసిన చిత్రం ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, మణిరత్నం మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ జానర్‌ను ఎంచుకున్నారు.
ఈ కొత్త సినిమాలో తొలిసారి విజయ్ సేతుపతి మరియు సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే 14న ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇద్దరు నటీనటులకూ ప్రస్తుతం పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!