

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు రాజస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగౌర్ జిల్లాలోని ఓ పొలం నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం ఆధారంగా రెండు రోజుల పాటు నిఘా కొనసాగించిన అనంతరం, ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 187 బస్తాల్లో ప్యాక్ చేసిన సుమారు 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర వేడుకల సమయంలో దాడులు చేయాలనే కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ భారీ కుట్రను సకాలంలో భగ్నం చేయగలిగామని పోలీసులు తెలిపారు. విజయవంతమైన ఆపరేషన్‌కు గాను రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పోలీసు బృందాన్ని అభినందించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!