
క్రీడలు

మంగ్లీ అధిక లాభాల పేరుతో రూ.10 కోట్ల మోసం చేశారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఆమె, తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
ఈ విషయంలో సుబ్బారావు అనే వ్యక్తి ఫేమ్ కోసం, బిగ్‌బాస్‌లోకి వెళ్లాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే, సుబ్బారావు తన నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసి, ఇవ్వనందుకు బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!