
క్రీడలు

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన, 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా జరిగిన ఈ భేటీతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరే అవకాశాలపై చర్చలు మొదలయ్యాయి.
మూడేళ్ల క్రితం జనసేనను వీడి మరో పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఆ పార్టీకి ఇటీవల ఎదురైన పరాజయం తర్వాత దూరమయ్యారు. ప్రస్తుతం జరిగిన ఈ సమావేశంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరిగాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్‌గా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!