

క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి సంయుక్తంగా టాప్‌లో నిలిచింది. మంగళవారం జరిగిన 13వ రౌండ్‌లో చైనాకు చెందిన టాన్ జోంగితో గేమ్‌ను డ్రాగా ముగించింది. మరోవైపు దివ్యా దేశ్‌ముఖ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ కేథరినా లాగ్నో చేతిలో ఓటమి పాలైంది. 13 రౌండ్ల అనంతరం వైశాలి, బిబిసార అసుబయేవా చెరో 7.5 పాయింట్లతో టైటిల్ రేసులో కొనసాగుతుండగా, దివ్యా 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
ఓపెన్ విభాగంలో ఆర్. ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో గేమ్‌ను డ్రాగా ముగించాడు. కాగా ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జావోకిర్ సిండరోవ్ ఒక రౌండ్ మిగిలుండగానే 9.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విజయంతో సిండరోవ్ ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డి. గుకేష్కు సవాల్ విసరనున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!