
తెలంగాణ ప్రభుత్వం శనివారం పలువురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా, సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఐ బొమ్మ రవి పైరసీ కేసు దర్యాప్తును నడిపిస్తున్నారు.
ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉన్న ముఖ్య నియామకాలు ఇలా ఉన్నాయి:
వి. అరవింద్ బాబు – హైదరాబాద్ CCS డీసీపీ
సుధీంద్ర – హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ
దారా కవిత – వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ
పి. కరుణాకర్, ఎస్విఎన్ శివరామ్, ఆర్. జగదీశ్వర్ రెడ్డి – ఇంటెలిజెన్స్ ఎస్పీలు
వైవిఎస్ సుధీంద్ర – సైబరాబాద్ ఎస్బీ డీజీపీ
సాయి శ్రీ – సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ
ఎం. రవీందర్ రెడ్డి – గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్
ఎన్. అశోక్ కుమార్ – సీఐడీ ఎస్పీ
ఇందులో అత్యంత చర్చనీయాంశంగా మారింది సైబర్ క్రైమ్ డీసీపీ కవిత బదిలీ. ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపులు వెలుగులోకి వస్తున్న సమయంలో, రవి పోలీస్ కస్టడీలో విచారణ జరుగుతున్న సందర్భంలో, ఆమె బదిలీ కావడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఈ కేసు క్రిప్టో ద్వారా చెల్లింపులు, మూవీరూల్జ్ లింకులు, విదేశీ కార్యాలయం వంటి కీలక అంశాలను బయటపెడుతున్న దశలో ఉండటంతో, కవితను ఇలాంటి కీలక సమయంలో ట్రాన్స్ఫర్ చేయడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!