
సినిమాలు

గ్రనడాలో జరిగిన వరల్డ్ కప్‌లో తెలుగు షూటర్ నేలవల్లి ముకేష్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో పాలక్ గులియాతో కలిసి 487.7 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్ జంట పేరిట ఉన్న 481.3 పాయింట్ల రికార్డును చెరిపేశారు.
ఫైనల్లో ముకేష్ 244.7 పాయింట్లు, పాలక్ 243 పాయింట్లు సాధించి అగ్రస్థానం దక్కించుకున్నారు. చైనా జట్టుకు రజతం, హంగేరీ జట్టుకు కాంస్యం లభించింది. సీనియర్ విభాగంలో ముకేష్‌కు ఇదే తొలి పతకం కాగా, జూనియర్ విభాగంలో ఇప్పటికే 22 అంతర్జాతీయ పతకాలు సాధించాడు. బుధవారం వ్యక్తిగత విభాగంలో కూడా ముకేష్ పోటీ పడనున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!