

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేరళ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే తన చివరి స్పందన అంటూ లేఖ రాసిన ఆయన, కేరళ సీఎం ఉపయోగించిన భాష నాయకత్వానికి తగిన స్థాయిలో లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని ప్రస్తావిస్తూ, జీఎస్డీపీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. అలాగే తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ ముందంజలో ఉందని, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
అదే సమయంలో కేరళలో పేదరిక నిర్మూలనపై ప్రశ్నలు లేవనెత్తిన రేవంత్, శబరిమల ఆలయ బంగారం అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ కేసులపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అంశాలపై బాధ్యతతో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చివరికి కేరళ ప్రజలే ఈ విషయాల్లో తుది నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చలను మరింత ఉధృతం చేశాయి.













.jpeg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!