
సినిమాలు

నిహారిక కొణిదెల నిర్మాణంలో, సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న ‘రాకాసా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ప్రీరిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 12.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.25 కోట్లకు, ఇతర ప్రాంతాల హక్కులు రూ. 1.25 కోట్లకు అమ్ముడవడంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ. 16 కోట్లకు చేరుకుంది.
నాన్ థియేట్రికల్ విభాగంలో కూడా ఈ సినిమా మంచి డీల్ సాధించింది. ఓటీటీ హక్కులు రూ. 10 కోట్లకు, ఆడియో హక్కులు రూ. 1 కోటికి విక్రయించబడ్డాయి. అయితే హిందీ డబ్బింగ్, శాటిలైట్ హక్కులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే థియేటర్లలో కనీసం రూ. 17 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. ప్రమోషన్లు బలంగా ఉండటంతో, మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!