
సినిమాలు

ఎన్టీఆర్–నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై వస్తున్న వదంతులకు చిత్ర యూనిట్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లుక్కు గానీ, షూటింగ్ షెడ్యూల్ రద్దయిందన్న వార్తలకు గానీ ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సినిమా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుతం కనిపిస్తున్న గ్యాప్ కేవలం సాధారణ ప్రిపరేషన్లో భాగమేనని యూనిట్ పేర్కొంది.
అధికారిక సమాచారం కాకుండా వస్తున్న వార్తలను నమ్మవద్దని అభిమానులకు సూచించింది. సినిమా సంబంధించిన అన్ని అప్డేట్స్ను అధికారికంగానే విడుదల చేస్తామని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై వచ్చిన రూమర్లకు తెరపడినట్టైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!