

దేశ ప్రజలే ప్రధానమని భావిస్తూ పౌరులే దేవుళ్లు అనే పాలనా సిద్ధాంతంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ప్రజలకు అందించే సేవలను కూడా సమయానుకూలంగా ఆధునికంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ సేవలను విస్తరించుతున్నామని పేర్కొన్నారు. దిల్లీలో నిర్వహించిన కర్మయోగి సాధనా వారోత్సవం-2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
దేశం అంతటా అన్ని స్థాయిలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాకేంద్రీకృత సేవల అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మరింత ఉపయోగకరంగా సేవలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!