

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట శనివారం జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరగగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఖమేనీ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలు పాటించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అనంతరం ఇరాన్ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఈ దాడి పక్కా సమాచారంతోనే జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమై ఉన్న సమయంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ పరిణామం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.











.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!