
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్‌లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో పాటు నోటిఫికేషన్ తేదీలను కూడా వెల్లడించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని లోకేశ్ పేర్కొన్నారు. నిర్ణయించిన సమయానికే పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుని అప్డేట్స్ పొందాలని సూచించారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.












.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!