

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల కానుండగా, గ్రూప్-1లో 91 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అదే రోజున హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇక సెప్టెంబర్ 15న 750 గ్రూప్-2 పోస్టులు, 503 ఏఈఈ పోస్టులు, ఇతరంగా 506 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా ప్రకటన ఇవ్వనున్నారు. అలాగే పాఠశాల మరియు ఇంటర్ విద్యకు సంబంధించిన 3,004 పోస్టుల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు.













.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!