

కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి సమీపంలో ఉన్న జ్యువెలరీ షాపులో పట్టపగలే కాల్పులతో దోపిడీ జరిగింది. జ్యోతినగర్‌లోని జిల్లా జడ్జి క్వార్టర్స్ వెనుక ఉన్న పీఎంజే జ్యువెలర్స్‌లో ఐదుగురు నుంచి ఏడుగురు దుండగులు కస్టమర్లుగా వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపి బంగారం దోచుకెళ్లారు.
మంత్రి పాల్గొన్న కార్యక్రమం కారణంగా అరగంట ముందు వరకు అక్కడ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటన స్థలంలో మ్యాగజైన్ లభించడంతో పోలీసులు కమిషనర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే బండి సంజయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి ధైర్యాన్ని అభినందించారు. ‘‘ఇది అత్యంత దురదృష్టకర ఘటన. పోలీసులు కచ్చితంగా దుండగులను పట్టుకుంటారు’’ అని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!