
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక టీ స్టాల్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుకాణం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అయితే స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ షాపులోని సామాగ్రి మొత్తం బూడిదవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!