
క్రీడలు

రిలయన్స్ జియో కొత్తగా రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే, వచ్చే నెల అదే తేదీన మళ్లీ రీఛార్జ్ చేయాలి. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాప్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. అయితే ఇతర ఓటిటి ప్లాట్‌ఫారమ్ సదుపాయాలు ఇందులో ఉండవు.
ఇదే విధమైన సదుపాయాలతో రూ.319 ప్లాన్ కూడా జియో అందిస్తోంది. కానీ రూ.339 ప్లాన్‌లో అదనంగా రూ.14.95 టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ టాక్‌టైమ్‌ను అంతర్జాతీయ కాల్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!