
క్రీడలు

ఐపీఎల్ 2026 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది.
హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) మెరుగైన ఆరంభం అందించగా, హెన్రిచ్ క్లాసెన్ అర్ధశతకం సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి కీలక పరుగులు చేశాడు. కోల్‌కతా తరఫున బ్లెస్సింగ్ ముజరబాని నాలుగు వికెట్లు తీశాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన కేకేఆర్ జట్టు, అంగ్క్రిష్ రఘువంశీ (52) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లతో హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!