

ముంబయి మహానగరపాలక సంస్థ (బీఎంసీ)కి కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అశ్వినీ భిడే నియమితులయ్యారు. దేశంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్‌గా పేరుగాంచిన బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కమిషనర్ భూషణ్ గగ్రాని పదవీకాలం ఈ రోజుతో ముగియడంతో ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది.
1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వినీ భిడే తన కెరీర్‌ను కొల్హాపుర్‌లో ప్రారంభించారు. అనంతరం నాగ్‌పూర్, సింధుదుర్గ్ జిల్లా పరిషత్‌లకు సీఈవోగా సేవలందించారు. రాజ్‌భవన్‌లోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, గత కొన్నేళ్లుగా ముంబయి నగర పాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో నగరంలో మెట్రో విస్తరణకు కీలకంగా వ్యవహరించారు.
ముఖ్యంగా ముంబయి మెట్రో లైన్-3 ప్రాజెక్టును ముందుండి నడిపించిన అశ్వినీ భిడే, సొరంగ తవ్వకం, భూసేకరణ, పునరావాసం వంటి అనేక సవాళ్లను అధిగమించి ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు “ముంబయి మెట్రో విమెన్”గా గుర్తింపు లభించింది. కొలాబా–సీప్జ్ మార్గాన్ని కలుపుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అమలులో ఆమె నాయకత్వం విశేషంగా ప్రశంసలు పొందింది.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!