

తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన కోర్ట్ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రియదర్శి కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ రీమేక్‌ను రంజన్ పేరుతో త్యాగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో నటి దేవయాని కుమార్తె ప్రియాంక కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సినిమా లాంఛ్ సందర్భంగా దేవయాని ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తన కూతురికి అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రియాంక సినీ ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
నటి దేవయాని తమిళం మాత్రమే కాకుండా తెలుగు సహా అనేక భాషల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందింది. అనంతరం దర్శకుడు రాజకుమారన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇనియా కాగా, చిన్న కుమార్తె ప్రియాంక. ప్రస్తుతం ఆమెను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన 3 బీహెచ్‌కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని నటించిన విషయం తెలిసిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!