

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో భారత్లో 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లుకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల సిలిండర్లు అమ్ముడైనట్లు కేంద్రం వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు చూపించి సమీపంలోని డిస్ట్రిబ్యూటర్ల వద్ద వీటిని పొందవచ్చని తెలిపింది. అలాగే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ 50 వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇంధన మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం ఈ నెల 4 న ఒక్కరోజే 90 వేల సిలిండర్లు అమ్ముడయ్యాయి. సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఒక్కరోజే 51 లక్షల సిలిండర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మొత్తం బుకింగ్‌లలో 95 శాతం ఆన్‌లైన్‌లో జరిగాయని పేర్కొంది. ఈ 5 కిలోల సిలిండర్లను ఎఫ్‌టీఎల్ సిలిండర్లుగా పిలుస్తారు. ఇవి మార్కెట్ ధరకు అందుబాటులో ఉంటాయి, సబ్సిడీ ఉండదు. నివాస ధ్రువీకరణ అవసరం లేకుండా వినియోగదారులు వీటిని సులభంగా పొందవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!