

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలధార–జలహారతి కార్యక్రమం అమలుపై అమరావతిలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని అధికారులు వివరించారు. అలాగే నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలు తొలి రోజే 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంపై ముఖ్యమంత్రి ప్రశంసించారు.
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాలు 8.59 మీటర్ల మేర పెరిగి, సుమారు 20 వేల బోర్లు రీచార్జ్ అయ్యాయని సీఎం తెలిపారు. ఈ మోడల్‌ను అన్ని జిల్లాలు అనుసరించాలని సూచించారు. నీటి సంరక్షణను సమర్థంగా అమలు చేస్తే రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!