

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ముఖాముఖీగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. హార్బర్ పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు ఉదాహరణ అని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన స్థాయిని మెరుగుపర్చేందుకు హార్బర్లు చాలా అవసరమని అన్నారు.
తన పాలనలో రాష్ట్రంలో పలు పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయని, శ్రీకాకుళం మూలాపేట మరియు మచిలీపట్నం పోర్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీజ్ చేసిన బోట్ల విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
జువ్వలదిన్నెలో మత్స్యకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారులకే అంకితం చేస్తామని చెప్పారు.






.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!