
క్రీడలు

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, పల్లా శ్రీనివాస్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులు ఇచ్చినట్లు పార్టీ తెలిపింది. సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్తవారికి అవకాశాలు కల్పించింది.
29 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. మహిళలు, బడుగు వర్గాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర కమిటీలో 50 మహిళలకు చోటు కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గణనీయ ప్రాతినిధ్యం ఇచ్చారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలను రూపొందించినట్లు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!