

గోపీచంద్ 33వ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ అనే శక్తివంతమైన పేరు పెట్టి గ్లింప్స్ విడుదల చేశారు. “కాలాతీతమైన మహిమలోని చెప్పని అధ్యాయం” అనే భావానికి తగ్గట్టుగా గ్లింప్స్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన ప్రత్యేకమైన కథా విధానంతో మరో కొత్త కథను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
గ్లింప్స్ చూస్తుంటే ఇది పీరియాడిక్ లేదా పౌరాణిక నేపథ్యం కలిగిన యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. గోపీచంద్ లుక్ మరియు బ్యాక్ గ్రౌండ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచేశాయి. దేశ చరిత్రలో తెలియని ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు భావిస్తున్నారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ సినిమాలతో తన ప్రతిభను నిరూపించిన సంకల్ప్ రెడ్డి, ఈసారి గోపీచంద్‌ను భారీ స్థాయిలో చూపిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుండగా, సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. గ్లింప్స్‌లో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుస పరాజయాల తర్వాత గోపీచంద్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!