

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో నాణ్యత పెంపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 27 వరకు తొమ్మిది మంది మంత్రులు సింగపూర్లో నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుపరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.
ఈ కార్యక్రమంలో ఆధునిక పాలన విధానాలు, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలపై అవగాహన పొందనున్నారు. ఈ శిక్షణలో పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బి. సి. జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, నిమ్మల రామా నాయుడు పాల్గొంటున్నారు. సింగపూర్ పరిపాలనా విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఏపీలో అమలు చేయడం ద్వారా సేవల నాణ్యత పెరగడం, పెట్టుబడులు ఆకర్షించడం, సంక్షేమ పథకాల అమలు మెరుగుపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!