

ఎన్టీఆర్ Jr. హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కబీర్ సింగ్ తో గుర్తింపు పొందిన షాహిద్ కపూర్‌తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆయన కూడా ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే, ఎన్టీఆర్–షాహిద్ మధ్య యాక్షన్ సన్నివేశాలు వెండితెరపై సంచలనం సృష్టించడం ఖాయం.
బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆయన ఇప్పటివరకు చూడని రగ్గడ్ మాస్ అవతారంలో కనిపించనున్నారని టాక్. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేయడంలో ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని, ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!