.jpeg&w=3840&q=75)

విజయ్ వర్మ, తమన్నా భాటియా పేర్లు వినగానే ఒకప్పుడు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గుర్తొస్తుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో ప్రారంభమైన వారి ప్రేమాయణం రెండేళ్ల పాటు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే 2025 మార్చిలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇది అభిమానులను తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ అధికారికంగా బ్రేకప్‌పై స్పందించకపోయినా, తాజాగా విజయ్ వర్మ సోషల్ మీడియాలో ఎదురవుతున్న నెగటివిటీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బ్రేకప్ తర్వాత తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌పై విజయ్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బహిరంగంగా విమర్శించడం తప్పుగా భావించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఆయన అన్నారు. ఎవరైనా ఇతరులను దూషించినా ప్రశ్నించేవారు లేరని, కానీ బాధితులనే ఎక్కువగా వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై అధిక జోక్యం, అబద్ధాల ప్రచారం జరుగుతోందని తెలిపారు. అందుకే వ్యక్తిగత విషయాలపై దృష్టి పెరగడంతో కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సోషల్ మీడియా విరామం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని విజయ్ వర్మ పేర్కొన్నారు. ఇటీవలే తాను పెద్ద ఇంటికి మారానని, పని ఒత్తిడితో కుటుంబం, స్నేహితులకు సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. ఇప్పుడు వారితో ఎక్కువ సమయం గడుపుతున్నానని, ఈ విరామం తనను తిరిగి తనతోనే కలిపిందని తెలిపారు. మరోవైపు తమన్నా భాటియా కూడా తన భవిష్యత్తు భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో మంచి లైఫ్ పార్టనర్‌గా మారాలని ప్రయత్నిస్తున్నానని, తన భాగస్వామి తన జీవితంలోకి వచ్చినందుకు అతను అదృష్టవంతుడని భావించేలా ఉండాలని అన్నారు. ఆ అదృష్టవంతుడి కోసం ఎదురు చూస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో బిజీగా కొనసాగుతున్నారు. విజయ్ వర్మ త్వరలో ‘మట్కా కింగ్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, తమన్నా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

.jpg&w=3840&q=75)








.jpeg&w=3840&q=75)







.jpg.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!