
క్రీడలు

ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో ఇవాళ 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 73 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఎండ తీవ్రత మరియు ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 262 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!