

ఇరాన్ చేపడుతున్న ప్రతీకార దాడులు దుబాయ్‌ను ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరంగా భావించే అభిప్రాయానికి దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని ప్రముఖ ప్రాంతాలపై కూడా డ్రోన్ దాడులు జరగడంతో యూఏఈ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు, పర్యాటకులు దుబాయ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దుబాయ్ పశ్చిమాసియాలో అత్యంత సురక్షితమైన ఆర్థిక, పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. అయితే ఇటీవల పామ్ జుమేరియా ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడులు, బుర్జ్ ఖలీఫా సమీపంలో పొగలు కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో భద్రతపై సందేహాలు పెరిగాయి. ఈ పరిణామాలపై యూఏఈ వ్యాపారవేత్త ఖలఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో యూఏఈ ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!