
న్యూస్

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ప్రెస్ మీట్లో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దర్శకుల సంఘంలోని ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి రూ.30 కోట్లతో సినిమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దర్శకుల సంఘంలోని సుమారు 10 మంది దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించారు. “మాతృదేవోభవ” దర్శకుడు అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!