
న్యూస్

ఇస్లామాబాద్‌లో జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు జరగలేదు. అదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది. డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరిగింది.
ఈ కాల్పులు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) చేసినవేనని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇరాన్ కూడా ఈ దాడిని ఒప్పుకున్నప్పటికీ కారణాలు చెప్పలేదు. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్పాడు. అయితే తమ నౌకలపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని షరతు పెట్టాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.






.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!