

ఉత్తరాంధ్రలో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ క్లీన్ ఎనర్జీ సంస్థ రిన్యూ ఎనర్జీ గ్లోబల్ 6 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. రూ.5,400 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌లో రూ.4,200 కోట్లతో సోలార్ ఇంగాట్–వేఫర్ తయారీ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు రెండు సంవత్సరాల్లో పూర్తి కానున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతంలో విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో రిన్యూ సంస్థ రూ.82,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో రూ.22,000 కోట్లతో మరో భారీ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో విండ్, సోలార్ ప్రాజెక్ట్‌లతో సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!