

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో ప్రతిపాదించిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా అధికారులను ఆదేశించారు. ఫేజ్-1లో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లో పనులు తక్షణమే ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్-2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు. అదనంగా ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026–31ను త్వరలో తీసుకురావాలని సూచిస్తూ, మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడ్‌టెక్ తయారీ, స్టార్టప్స్, మెడికల్ టూరిజం, వెల్నెస్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి మరియు వీఎంఆర్ ప్రాంతాల్లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సంజీవని ప్రాజెక్టు పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రజల వైద్య ఖర్చులను తగ్గించేందుకు ప్రివెంటివ్ హెల్త్‌కేర్, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు అందించగా, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేసి, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. డిజిటలైజేషన్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ప్రజారోగ్యంపై అవగాహన పెంచాలని ఆయన పేర్కొన్నారు. అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
.png&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!