
రాజకీయాలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులకు ఇరాన్‌కు ఎటువంటి మార్గంలోనూగాలి మార్గం గానీ, భూమి మార్గం గానీ ప్రయాణం చేయవద్దని తాజా హెచ్చరిక జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. భారత్ నుంచి ఇరాన్‌కు కొంతమంది విమానాలు ప్రారంభమయ్యాయని వార్తలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సురక్షితంగా లేవని తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల పరిమితులు, విమానాల కార్యకలాపాల్లో అనిశ్చితి కొనసాగుతున్నట్లు పేర్కొంది.
ఇరాన్‌లో ఉన్న భారతీయులు తప్పనిసరిగా అక్కడి నుంచి బయటకు రావాలని సూచించింది. రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని నిర్దిష్ట భూసరిహద్దు మార్గాల ద్వారా దేశాన్ని వీడాలని సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!