

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కీలక చర్చ జరగనున్నది. కార్మికులు పెట్టిన 32 డిమాండ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, ఆర్టీసీ విలీనం అంశంపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన హైకోర్టు తీర్పు అనంతరం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చ జరగనుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదే సమయంలో మెట్రో స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి విధివిధానాలు ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా చర్చించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం, గవర్నర్ కోటా నియామకాలు, సీపెక్ కుల సర్వే, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణ, భూముల కేటాయింపు, సీఎస్ఆర్ నిధుల పెంపు వంటి అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నాయి.


.webp&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!