
రాజకీయాలు

హైదరాబాద్‌లో మరో భారీ కల్తీ దందా బయటపడింది. అధికారులు నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్‌కు సంబంధించిన పదార్థాలను గుర్తించారు. వాడిన టీ పొడికి మళ్లీ రంగులు కలిపి వినియోగిస్తున్నట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ దందాలో భాగంగా కొంతమంది టీ షాప్ యజమానులు కల్తీ టీని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక దళం నిర్వహించిన గుప్త ఆపరేషన్‌లో 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రత్యేక దళం ఏర్పాటు చేసిన తర్వాత నగరంలో ఇలాంటి కల్తీ వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్‌ను కూడా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఈ దందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!