
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు అభినందనలు తెలిపారు. ఈ నియామకం ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఒక కీలక ముందడుగుగా సీఎం పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత విభిన్న కేసులను సమర్థంగా నిర్వహిస్తూ ఆమె ప్రతిష్ఠాత్మకమైన, ఆదర్శప్రాయమైన న్యాయవృత్తిని నిర్మించుకున్నారని తెలిపారు. న్యాయంపట్ల ఆమె చూపుతున్న నిబద్ధత ఆమెకు మరింత గౌరవాన్ని తెచ్చిందని చెప్పారు. న్యాయపాలనను కాపాడుతూ, నిజాయితీతో న్యాయం అందించడంలో ఆమె పదవీకాలం విజయవంతంగా, ప్రేరణాత్మకంగా, ప్రభావవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

.webp&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!