

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడం అశాస్త్రీయ విధానం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా చేస్తే వైబ్రేషన్లు ఏర్పడి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడయ్యే ప్రమాదం ఉందని హరీశ్ రావు హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, తరచూ ఆపడం వల్ల భారీ నష్టం సంభవిస్తుందని తెలిపారు. చందలాపూర్తో పాటు ప్యాకేజీలు 6, 8, 10, 11, 12 లో మోటార్ల నిర్వహణ తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. రైతుల జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టులతో రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వానికి సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!