

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై కొండంత అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ట్రెండింగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం గత మార్చిలో విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి వాయిదా పడింది.
మూవీ యూనిట్ మార్చి రిలీజ్‌ను స్కిప్ చేయడం వల్ల భారీ పోటీ నుంచి తప్పించుకోవచ్చని భావించింది. అలాగే నాణ్యతపై కూడా దృష్టి పెట్టడం సాధ్యమవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.
నాని 'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ కలిసి పని చేయడం అభిమానుల్లో ఉత్సాహం పెంచింది. ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతుంది. అయితే ఆగస్టు 21వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ ఆపకూడదని యూనిట్ దృఢ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సినిమా మళ్ళీ వాయిదా పడదనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!