.webp&w=3840&q=75)

రవిపై వస్తున్న సినిమాల పైరసీ ఆరోపణల గురించి ఆయన తండ్రి చిన్న అప్పారావు గారు మాట్లాడారు. సినిమాల పైరసీ చేస్తున్నాడనే విషయం తనకు తెలియదని, తనకున్న సమాచారం మేరకు రవి అలా ఏ తప్పు పనులు చేయడం లేదని చెప్పారు.
“రవి నేరం చేయలేదని నేను అనుకుంటున్నా. కానీ విచారణ చేసి నిజంగా ఏదైనా నేరం చేశాడని తేలితే, చట్టపరమైన చర్యలు ఏవైనా వచ్చినా ఒప్పుకోవాల్సిందే” అని ఆయన అన్నారు. గత రెండు సంవత్సరాలుగా రవి ఇంట్లోనే ఉంటున్నాడని కూడా చెప్పారు. “పోలీసులు సమన్ విసిరితే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం సరైనదేనా?” అని ఆయన ప్రశ్నించారు.
అలాగే రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఒక అమ్మాయి ఉందని ఆయన వెల్లడించారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయనీ, ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు ఆ వ్యక్తిగత సమస్యలకూ సంబంధం ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు. అసలు నిజాలు మాత్రం పూర్తిస్థాయి విచారణ తర్వాతే బయటకు వస్తాయని తండ్రి స్పష్టం చేశారు.









.jpg&w=3840&q=75)
.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!