
ఓటీటీ

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఇంకా ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 4,87,707 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 1,77,175 మంది ప్రాణాలు కోల్పోగా, 4,71,441 మంది గాయపడ్డారు. సగటున ప్రతి గంటకు 56 ప్రమాదాలు చోటుచేసుకోగా, దాదాపు 20 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది.
రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 67,526 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. మరణాల విషయంలో ఉత్తరప్రదేశ్ 24,118 మరణాలతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం మృతుల్లో 46.2 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. రోడ్డు భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!